కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలమూరు మండలం మడికి నాలుగు లేన్ల జాతీయ రహదారిపై..

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2023 2:56 AM

AP, Accident, 4 People Dead, Konaseema, Auto, Car

 కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలమూరు మండలం మడికి నాలుగు లేన్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా మ్యాజిక్‌ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.

శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా మ్యాజిక్‌ వాహనంలో రంపచోడవరం నుంచి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పది వెళ్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి నలుగురితో భీమవరం వెళ్తున్న కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇక మిగతా 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి చేరుకున్నారు. విగతజీవులుగా పడివున్న వారిని చూసి బోరున విలపిస్తున్నారు.

Next Story