వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పలువురు కీలక నేతలు కలిశారు.

By Medi Samrat
Published on : 25 Sept 2024 4:59 PM IST

వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పలువురు కీలక నేతలు కలిశారు. వైఎస్ జగన్ ను కలిసిన నేతలలో కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీలో సంస్థాగత మార్పులు జరుగుతూ ఉండడంతో, రాజకీయ పరిణామాలను చర్చించడంతో పాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్‌ జగన్‌ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ భేటీ అయ్యారు. ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. నాని, వంశీల‌తో పాటు జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని, ఉప్పాల రాము, హారిక‌ త‌దిత‌రులు ఉన్నారు.







Next Story