నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం

Kidnapping in Nellore District.నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. మాజీ జెడ్పీసీఈఓ సుబ్రహ్మణ్యం సోదరుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 7:27 AM GMT
నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం

నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. మాజీ జెడ్పీసీఈఓ సుబ్రహ్మణ్యం సోదరుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. త‌న సోదరుడు గోపాలకృష్ణను కిడ్నాప్ చేశారని సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాము నివాసం ఉంటున్న పుత్తూరు నుంచి కిడ్నాప్ చేసి వెంకటగిరికి తీసుకువచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి వెంకటేశ్వర్లుపైన ఆరోపణలు చేశారు. కిడ్నాప్‌కు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు తెలిపారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు పుత్తూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

Next Story
Share it