రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటన

మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.

By Srikanth Gundamalla
Published on : 10 Jun 2024 7:43 PM IST

kesineni nani,  politics, andhra pradesh,

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటన

సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన..విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇంతటితో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని చెప్పారు. అయితే.. ఈసారి ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతిలో కేవినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. తన ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

అనేక అంశాలను, వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతి స్పందనలను అన్నింటినీ గమనించానని చెప్పారు. ఆ తర్వాతే రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని అన్నారు. రెండు సార్లు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేశాననీ.. ఈ అవకాశం తనకు దక్కినందుకు గౌరవంగా భావిస్తానని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధి కోసం మున్ముందు తాను అవసరం ఉంటే కచ్చితంగా చేస్తానని చెప్పారు కేశినేని నాని.

ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని ఆయన చెప్పారు. ఎంతో విలువైన జ్ఞాపకాలన తీసుకెళ్తున్నట్లు చెప్పారు. విజయవాడ అభివృద్ధి కోసం పరితపిస్తున్న కొత్త నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story