Kakinada: ఫైన్‌ కట్టమన్నందుకు ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు

రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్‌పై ఓ కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి చేసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  17 March 2023 8:45 AM GMT
Kakinada, RTO officer, coconut trader

ఫైన్‌ కట్టమన్నందుకు ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు 

రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్‌పై ఓ కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి చేసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ ఇన్ స్పెక్టర్ కొబ్బరికాయల విక్రేతను లైసెన్స్ విషయమై ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు అధికారిపై సదరు వ్యాపారి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కత్తిపోట్లకు గురైన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వేలు కోల్పోయాడు. స్థానికుల సహాయంతో అధికారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం కాకినాడలోని దేవదాయ శాఖ ఆఫీసు సమీపంలో వ్యాన్‌పై పెంటా వెంకటదుర్గా ప్రసాద్‌ అనే వ్యక్తి కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు. తనిఖీల్లో భాగంగా అసిస్టెంట్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.చిన్నారావు.. అతడి దగ్గరికి వెళ్లి వ్యాన్‌ రికార్డులు, ఫిట్‌నెస్‌ సిర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ పేపర్లను అడిగాడు. అలాగే వ్యాన్‌కు ఇదివరకే పడిన ఫైన్ కట్టాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

దుర్గాప్రసాద్‌ ఆవేశంతో తన దగ్గరున్న కోబ్బరి బోండాల కత్తితో ఇన్‌స్పెక్టర్‌ని గాయపరిచాడు. అయితే అక్కడున్న వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై దాడి చేయబోయాడు. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌ చేతి వేలు తెగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story