ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణం చేసిన జ‌స్టిస్ ఎస్‌.అబ్దుల్ న‌జీర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 Feb 2023 11:09 AM IST

AP Governor Justice Nazeer, Justice Nazeer Takes Oath as Andhra Pradesh Governor,

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణం చేసిన జ‌స్టిస్ ఎస్‌.అబ్దుల్ న‌జీర్‌


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

1958 జ‌న‌వ‌రి 5న కర్ణాటకలోని బెలువాయిలో అబ్దుల్‌ నజీర్ జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితుల‌య్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన ఒకరు.

Next Story