ఏపీ యువతకు ఇన్ఫోసిస్ సహకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.

By Knakam Karthik  Published on  10 Jan 2025 3:33 PM IST
AP GOVENRMENT, INFOSYS, AP YOUTH, MININISTER NARA LOKESH, AGREEMENT, SKILL DEVELOPMENT,JOBS

ఏపీ యువతకు ఇన్ఫోసిస్ సహకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం



ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఎలాంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఈ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు. స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధ్రువీకరణ కోసం డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలొ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సన్ డేటా ప్రివాలిడేషన్‌కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభిందనీయమని అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మార్గం సులభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.


డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ లెర్నింగ్ పాత్‌వేస్‌కు విద్యార్థులను కనెక్ట్ చేసే యూజర్ ప్రెంఢ్లీ ఇంటర్ ఫేస్‌లరు సృష్టించి, నిరంతర ప్రాక్టీస్‌ను సులభతరం చేస్తుంది. పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకరిస్తుంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్ ఫారమ్‌లో ఉచిత ఆన్ లైన్ కోర్సులు, వర్క్ షాప్‌లు నిర్వహించి అంచనా వేసిన నైపుణ్యాలు, కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతర నైపుణ్యాభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని ఇన్ఫోసిస్ అందించనుంది. ఇన్ఫోసిస్ పారదర్శక, డేటా ఆధారిత ఫలితాలను నిర్ధారిస్తూ నైపుణ్య అంచనాల పురోగతి, ఫలితాలను ట్రాక్ చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఏపీలో 15-59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ౩.59 కోట్ల మందికి సంబంధించి నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ప్రివాలిడేషన్ చేయనుంది. దీని ద్వారా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న స్కిల్ సెన్సస్ ఫ్రేమ్ వర్క్, స్కిల్ అప్లికేషన్‌లో డిజిటల్ ప్లాట్ ఫారమ్ ఏకీకరణ సులభతరం అవుతుంది.

Next Story