ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మంసం ప్రియులకు ధరల సెగ తగులుతోంది. 20 రోజుల క్రితం కిలో రూ.175కు విక్రయించిన కోడి మాంసం ప్రస్తుతం రూ.280కి విక్రయిస్తున్నారు. ఉన్నట్టుండి 3 వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర రూ.100కుపైగా పెరిగింది. ఇక ఆదివారం నాడైతే కిలో చికెన్ ధర రూ.300 దాటుతోంది. అయితే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కోళ్ల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. శీతాకాలం ముగియడంతో రాష్ట్రంలో పాదరసం ఎగసిపడుతోంది. రెండు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల నుండి 39 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతోంది.
వాతావరణంలో మార్పుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ జరగడం లేదు. అంతేకాదు.. చికెన్ ఫీడ్ రేటును కూడా పెంచడం వల్ల చికెన్ ధరలు పెరుగుతాయి. భారతీయ (దేశీ) కోడి మాంసం రేటు కూడా పెరుగుతోంది. కిలో మాంసం రూ.400 నుంచి 500 కిలోల వరకు విక్రయిస్తున్నారు. దేశీ చికెన్ ధర పెరగడానికి కారణం దేశీ కోళ్లు మార్కెట్‌లో పెద్దగా అందుబాటులో లేకపోవడమే. సిటీలోని ఎంపీ జంగిల్స్‌లో పెంచుతున్న దేశీ కోళ్లను కొందరు వ్యాపారులు తీసుకువస్తున్నారు. స్థానిక పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న దేశీ చికెన్ కిలో రూ. 500 పడుతోంది.