ఉచిత విద్యుత్ వద్దు.. ఎమ్మెల్యే నే కావాలి అన్న యువతి.. అదిరిపోయే రిప్లై
Im not on the manifesto Raghav Chadhas savage reply.ఉచిత విద్యుత్ వద్దు.. మీరే కావాలి అని ఓ యువతి ఆప్
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2021 4:23 AM GMT
ఉచిత విద్యుత్ వద్దు.. మీరే కావాలి అని ఓ యువతి ఆప్ ఎమ్మెల్యేకు ట్వీట్ చేయగా.. సదరు ఎమ్మెల్యే ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దాకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పంజాబ్‌లో ఉచిత విద్యుత్ కావాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఓ యువతి స్పందిస్తూ.. 'నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి' అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి ట్వీట్ చేసింది.
I'm not on the manifesto, but free electricity is.
— Raghav Chadha (@raghav_chadha) July 31, 2021
Vote for Kejriwal and I promise you'll get free electricty, 24x7. Can't commit the same about myself though :) https://t.co/F0tqLLp1FL
సదరు ట్వీట్‌ను చూసిన ఎమ్మెల్యే ఆ యువతి కామెంట్ పల్ల అంతే ఆశ్చర్యకరంగా సమాధానం ఇచ్చారు.' పార్టీ మేనిఫెస్టోలో నేను లేనే.. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూస్తాలే' అంటూ రిప్లై ఇచ్చారు. కాగా.. ఆ యువతికి సంబంధించిన ట్వీట్ కొద్దిసేపటికే డిలీట్ చేయగా.. రాఘవ ఆ ట్వీట్ల స్క్రీన్ షాట్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.