Konaseema: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో.. జైలుపాలైన భర్త
సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసిన భర్తను కాట్రేనికోన పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 2 March 2023 10:45 AM GMTసోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో.. జైలుపాలైన భర్త (ప్రతీకాత్మక చిత్రం)
కోనసీమ: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక శుభ ఘట్టం. ఈ వేడుకలో వధూవరులు తమ వివాహాన్ని జరుపుకుంటారు. ఇటీవల కాలంలో జంట వారి వివాహ ఈవెంట్‌లను రికార్డ్ చేయడం ఆనవాయితీగా మారింది. హల్దీ ఈవెంట్, వివాహానికి ముందు షూట్, ఇతర సందర్భాలలో, వివాహ వేడుక సమయంలో వీడియో రికార్డ్‌లు చేసుకుంటున్నారు. అంతవరకు ఒకే కానీ.. కొన్నిసార్లు యువత తప్పుదారిలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి విపరీతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెళ్లి తర్వాత తొలిరాత్రికి సిద్ధమైన వరుడు తన భార్యతో అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన షాకింగ్ సంఘటన ఒకటి నమోదైంది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాట్రేనికోన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(20), మైనర్ బాలిక (17) ఫిబ్రవరి 8న పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాతి తంతులో భాగంగా పెద్దలు నవ దంపతులకు తొలిరాత్రి ఏర్పాటు చేశారు. వరుడు వారి తొలిరాత్రికి సంబంధించిన ఏకాంత వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిబ్రవరి 20న భర్తపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిబ్రవరి 28న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.