ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం(తాడేప‌ల్లి గూడెం) ప‌రిధిలో పోలీసుశాఖ హై అల‌ర్టు ప్ర‌క‌టించింది. తాడేపల్లిలో ఆయన నివాసం, పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన ఉద్య‌మం శ‌నివారంతో 550వ రోజుకు చేరుకుంది. ఈ క్ర‌మంలో రైతులు భారీ ర్యాలీలు, నిర‌స‌న‌లు చేప‌ట్టడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే.. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే ముంద‌స్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి పరిధిలో నివాసముండే వారు కొత్త వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story