ఏపీలో రెండో బాష‌గా ఉర్దూ.. చ‌ట్టాల స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం

Here are key highlights of AP Cabinet meeting.ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాష‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 7:16 PM IST
ఏపీలో రెండో బాష‌గా ఉర్దూ.. చ‌ట్టాల స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాష‌గా ఉర్ధూను గుర్తిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణ చేయాల‌ని తీర్మానించింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ భేటీలో 35 కీల‌క అంశాల‌పై చర్చించారు. అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టే ప‌లు బిల్లుల‌కు కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. విదేశీ మద్యం నియంత్రణ చట్టం, హిందూ ధార్మిక సంస్థల చట్టం, తితిదేలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం చట్ట సవరణలకు ఏపీ కేబినెట్ ఆంగీకారం తెలిపింది.

ఉద్యోగుల రిటైర్‌మెంట్ వ‌య‌స్సును 62 ఏళ్ల‌కు పెంచుతూ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బిల్లుకు ఆమోదం ల‌భించింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం పలికింది. రూ.1234 కోట్లతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మ‌రోవైపు రూ.8,741 కోట్ల రుణ స‌మీక‌ర‌ణ‌కు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఉండేందుకు, మ‌డ‌క‌శిర బ్రాంచ్ కెనాల్ ప‌నుల‌కు రూ.214 కోట్లు కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ అంగీకారం తెలిపింది.

Next Story