కాకినాడలో పార్క్‌ చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీలో పొగ..భయపడ్డ జనం

కాకినాడలో పార్క్‌ చేసి ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన..

By Srikanth Gundamalla  Published on  24 Jun 2023 2:15 PM IST
EV Scooter, Smoke, Kakinada, Andhra Pradesh

 కాకినాడలో పార్క్‌ చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీలో పొగ..భయపడ్డ జనం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో.. వాహనాలు కొనుగోలు చేసేవారంతా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాక ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణానికి మంచిదని.. ప్రభుత్వాలు కూడా ఆయా సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. అయితే.. ఈ-వాహనాలను కొన్న వారు కొందరు కంప్లైంట్స్‌ చేస్తున్నారు. దీనికి కారణంగా వరుసగా వెలుగు చూస్తోన్న ప్రమాదాలు. ఉన్నట్లుండి వెహికల్‌లో మంటలు చెలరేగుతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోనూ ఓ ఎలక్ట్రిక్‌ స్కూటీ ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాకినాడలోని సర్పవరం జంక్షన్‌ వద్ద కొన్ని వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయి. అక్కడే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా ఉంది. ఉన్నట్లుండి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. దీంతో.. అప్రమత్తమైన స్కూటీ ఓనర్ సీట్‌ని ఓపెన్ చేశాడు. కానీ పొగ రావడం మాత్రం ఆగలేదు. మరింత ఎక్కువైంది. భయపడిపోయిన సదురు బైక్‌ ఓనర్‌ రోడ్డుపైనే వదిలేసి పక్కకు వెళ్లిపోయాడు. పొగ భారీగా వచ్చింది. అది చూసిన స్థానికులు భయపడిపోయారు. స్కూటీకి దూరంగా వెళ్లారు. ఒక అక్కడే ఉన్న దుకాణాదారులు మంటలు వ్యాపిస్తాయనే భయంతో షాపులను మూసేశారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story