అనంతలో భారీ వర్షం.. పలు కాలనీలు జలమయం
Heavy Rain in Anantapur.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం పట్టణాన్ని వరదనీరు
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. రాత్రి రెండు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో అర్థరాత్రి ప్రజలు డాబాలపైకి వెళ్లి భయభయంగా గడిపారు. ఇప్పటికి కొన్ని కాలనీల్లో మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.
రుద్రంపేట, నడిమివంక, ఆదర్శ్‌నగర్ కాలనీలు జలమయం కాగా.. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగస్వాము నగర్‌లో చిక్కుకున్న కాలనీవాసులను బోట్ల సాయంతో అధికారులు రక్షించేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాలలోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 30 మంది వరదనీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ జాకీర్ హుస్సేన్, సిబ్బందితో కలిసి వెళ్లి విద్యార్థులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇలాంటి వరదను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని అనంతపురం వాసులు చెబుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద అధికంగా ఉండడంతో ఏ ఒక్కరు ఇళ్లల్లో ఉండవద్దని సహాయక శిబిరా