గన్నవరం ఎయిర్‌పోర్టులో పొగమంచు.. గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన రెండు విమానాలు
Heavy fog at Gannavaram airport.ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు కారణంగా
By తోట వంశీ కుమార్ Published on
27 Feb 2021 4:52 AM GMT

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్ ఇవ్వకపోవడంతో రెండు విమానాలు సుమారు గంట సేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు సిగ్నల్ రాలేదు. విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో.. అందులో ప్రయాణిస్తున్న 67 మంది ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా.. విమానం ల్యాండ్ అయ్యేందుకు గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత సిగ్నల్ దొరకడంతో.. 40 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యింది.
మరోవైపు ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం సైతం పొగమంచు కారణంగా ల్యాండింగ్ ను అనుమతి లభించలేదు. దాదాపు 4 రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం చివరకు 15 నిమిషాలు ఆలస్యంగా గన్నవరం విమానాశ్రమంలో ల్యాండ్ అయ్యింది. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story