అమరావతి: 6,100 కానిస్టేబుల్ పోస్టుల ఫైనల్ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. నేటి నుంచి మే 31 వరకు కానిస్టేబుల్ అభ్యర్థులు slprb.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే 94414 50639 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు సూచించారు. జూన్ 1వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షలు ఉంటాయి.
దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన 38,910 మంది అభ్యర్థులు తుది పరీక్ష రాయనున్నారు. వేగంగానే ఫలితాలు వెల్లడిస్తామని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. తుది పరీక్షను జేఎన్‌టీయూ ద్వారా నిర్వహిస్తున్నట్లు బోర్డు పేర్కొన్న.. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో 9441450639 లేదా 9100203323 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.