సీఐ కి ఫైన్ వేసి.. మాస్క్ తొడిగిన ఎస్పీ

Fine for Guntur traffic CI for not wearing a mask. గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.

By Medi Samrat  Published on  30 March 2021 6:15 AM GMT
Guntur traffic CI

దేశంలో కరోనా మళ్లీ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి. గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలేదు అని ప్రశ్నించగా.. సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అని చెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి, స్వయంగా మాస్కు తొడిగారు.

కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.


Next Story
Share it