తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలిపారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేశ్ ను రాజకీయాలు నుండి తప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్మరని.. మీ కొడుకులాగా సందులో నుంచి రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబుపై అమర్నాథ్ చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దేబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం చేశారని అన్నారు.