Andhra Pradesh: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 30 July 2024 10:06 AM IST
Andhra Pradesh: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.08 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. సెకండియర్ చదువుతున్న విద్యార్థులు 92,134 మంది ఉన్నారు. వీళ్లందరికీ ఒక్కో విద్యార్థికి 12 చొప్పున నోట్ పుస్తకాలతో పాటు పాఠ్యపుస్తకాలు, బ్యాంగులను అందించనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు అధికారులు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. అయితే.. విద్యార్తులకు ఆరు చొప్పున వైట్ నోట్‌బుక్స్, రూల్ నోట్‌బుక్స్ ఇస్తారు. బ్యాగుతో సహా వీటిని ఇవ్వనున్నారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులు బయట పాఠ్యపస్తకాలను కొనుగోలు చేయాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వమే ఇకనుంచి ఇస్తామని చెప్పడంతో వారిపై భారం తగ్గనుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్మీడియట్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటర్ విద్యార్థులకు కూడా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అదే హామీని ప్రస్తుతం సీఎం చంద్రబాబు అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించారు. బ్యాగులతో కలిపి జిల్లా కేంద్రానికి.. అక్కడి నుంచి మండలాలకు చేరాయి. త్వరలోనే బుక్స్ పంపిణీ చేయనున్నారు.