పశ్చిమగోదావరి జిల్లా కోలాయగూడెం మండల పరిధిలోని ఏడువాడల పాలెం గ్రామంలో శనివారం పొలంలో బోర్‌వెల్ పైపులైన్ తవ్వుతుండగా మట్టి కుండలో సుమారు 18 బంగారు నాణేలు బయటపడ్డాయి. మండలంలోని ఏడువాడల పాలెం గ్రామంలో మానుకొండ సత్యనారాయణకు చెందిన పొలంలో దొరికిన మట్టి కుండలో 17 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అనంతరం మరో నాణెం లభించింది. పొలం యజమాని తహశీల్దార్‌కు సమాచారం అందించగా పొలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామస్తుల సమక్షంలో పొలం యజమాని వాంగ్మూలం తీసుకుని మట్టి కుండతోపాటు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
కొయ్యలగూడెం తహశీల్దార్ పి.నాగమణి సత్యనారాయణకు చెందిన పామాయిల్ ఫారంలో మొత్తం 61 గ్రాముల బంగారం 18 నాణేలు లభించినట్లు తెలిపారు. ''అతను మాకు సమాచారం అందించాడు. మేము వెంటనే పొలానికి వెళ్లాము. బంగారు నాణేల గురించి విచారించాము. ఆ తర్వాత మేము నాణేలను సేకరించాము.'' అని చెప్పారు. ఆ బంగారు నాణేలను జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో అందజేసి ట్రెజరీలో జమ చేయనున్నారు. ఘటనపై పురావస్తు శాఖకు అధికారులు సమాచారం అందించారు.
ఈ బంగారు నాణేలు రెండు శతబ్దాల క్రితం నాటివని భావిస్తున్నారు.