ఉగ్ర రూపం దాల్చిన గోదావరి
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ
By Medi Samrat Published on 27 July 2024 4:54 PM IST
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి మళ్లీ క్రమేపీ పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు నీటిమట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రస్తుతం 53 అడుగులతో ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో మూడు సార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మళ్లీ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. స్థానిక ఎటపాక వాగు పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలోని 36 కుటుంబాలను భద్రాచలం నన్నపనేని హై స్కూల్ లోని పునరావాస కేంద్రానికి తరలించారు.
Next Story