పెళ్లై మూడు నెలలైనా దగ్గరకు రాని భర్త.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!
వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులే కాకుండా.. శారీరక లోపాలను దాచి పెళ్లి చేసి మోసం చేస్తున్న ఘటనలు నేడు ఆందోళన కలిగిస్తున్నాయి.
By - అంజి |
పెళ్లై మూడు నెలలైనా దగ్గరకు రాని భర్త.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!
వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులే కాకుండా.. శారీరక లోపాలను దాచి పెళ్లి చేసి మోసం చేస్తున్న ఘటనలు నేడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విజయవాడలోని గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. నపుంసకత్వాన్ని దాచిపెట్టి వివాహం చేసుకోవడమే కాకుండా, ప్రశ్నించినందుకు చంపేస్తామని బెదిరించిన భర్త, అత్తమామలపై ఒక యువతి ఫిర్యాదు చేసింది. నంద్యాలకు చెందిన ఓ యువతి స్థానికంగా పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తోంది.
ఆమెకు గతేడాది డిసెంబరు 26న కడప జిల్లాకు చెందిన, విజయవాడలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న యువకుడితో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 15 లక్షల నగదు, అదనంగా దుస్తుల కోసం మరో లక్ష రూపాయలు, మరియు 5 తులాల బంగారాన్ని కట్నకానుకలుగా సమర్పించారు. వివాహం జరిగిన నాటి నుంచే భర్త ప్రవర్తన వింతగా ఉండేది. రిసెప్షన్ రోజే వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన అతను, ఆ తర్వాత సంసారానికి దూరంగా ఉంటూ రాత్రిపూట ఇంటికి రాకుండా తప్పించుకునేవాడు.
దీనిపై భార్య గట్టిగా నిలదీయగా.. "నీతో సంసారం చేయడానికి కాదు, మా తల్లిదండ్రులకు సేవ చేయడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి, ఆమెను సోదరుడి ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్త శారీరకంగా సంసారానికి పనికిరాడనే నిజాన్ని దాచిపెట్టి మోసం చేశారని గ్రహించిన బాధితురాలు, తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తమామలను, పెళ్లి పెద్దలను నిలదీసింది. అయితే, తమ తప్పును ఒప్పుకోవాల్సింది పోయి.. వారు బాధితురాలిపై ఎదురుదాడికి దిగారు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను ఇంట్లో నుంచి గెంటివేశారు. బాధితురాలు గత్యంతరం లేక గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.