గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. శ్రీనివాస CBSE స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి యూకేజీ విద్యార్థి చిన్నారి కూచిపూడి కృప అన్వేష్ (4) మృత్యువాత పడ్డాడు. వెనుక వైపు ఉన్న అన్వేష్‌ను చూసుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీశాడు. దీంతో బస్సు వెనుక చక్రాల కింద నలిగిపోయి అన్వేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారీ అయ్యాడు. ఈ హృదయ విదారక ఘటనను చూసి స్థానికులు చలించిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.