ఏపీకి చెందిన నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప కైవల్య.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 7:17 AM IST
four months baby, nobel world record, andhra pradesh,

ఏపీకి చెందిన నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డు

నాలుగు నెలల వయసులో పిల్లలకు ఏం తెలుస్తుంది? ఆకలి వేస్తే ఏడవడం తప్ప ఇంకేం చేయలేరు అంతే కదా. ఇలా అనుకుంటే పొరపాటే. ఓ నాలుగు నెలల చిన్నారి అందరికీ మించి తెలివిగా ఉంది. పక్షులు, జంతువులు, కూరగాయలు ఇలా 120 విభిన్న రకాల ఫొటోలను సునాయసంగా కనిపెట్టి అడిగిన వాటిని కరెక్టుగా చూపిస్తోంది. అయితే.. తల్లి తన కూతురి టాలెంట్‌ను గమనించి.. వాటన్నింటినీ వీడియో రికార్డు చేసింది. ఆ తర్వాత వీడియోను నోబెల్‌ వరల్డ్ రికార్డ్స్‌కు పంపించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప కైవల్య. చిన్నారిని ఆడిపిస్తున్న సమయంలో వస్తువుల పేర్లు చెబితే వెంటనే పట్టుకోవడాన్ని గమనించింది తల్లి. అలా తన కూతురిలో కాంట్రేషన్‌ ఎక్కువగా ఉందనీ పలు రకాల ఫొటోలను చూపించి అందులో తను చెప్పిన వాటినే పట్టుకోమని అడిగింది. ఆశ్చర్యంగా పాప కూడా వాటినే పట్టుకోసాగింది. దాంతో.. చిన్నారి టాలెంట్‌తో అబ్బురపడిపోయిన తల్లి వీడియో రికార్డు చేసుకుంది. ఆ తర్వాత వాటిని నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు పంపించింది.

నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఉన్న జట్టు కూడా వీడియోలను చూసి అలాగే ఆశ్చర్యపోయింది. వీడియోను జాగ్రత్తగా పరిశీలించింది. కైవల్య ప్రతిభను గుర్తించింది. ఆమె వరల్డ్‌ రికార్డు సాధించిందంటూ ప్రత్యేక సర్టిఫికెట్‌ను సదురు కుటుంబానికి అప్పగించింది. కేవలం నాలుగు నెలల వయసులో వరల్డ్‌ రికార్డు హోల్డర్‌గా నిలవడంతో కౌవల్య తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎంతటి అవరోధాన్ని అయిన అందుకోవచ్చు అనే దానికి నిదర్శనం మా నాలుగు నెలల పాప కైవల్య అని ఆ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story