గుంటూరులో కలకలం.. నలుగురు మైనర్లు అదృశ్యం
Four Miners Disappeared in Guntur.ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మొత్తం నలుగురు మైనర్లు అదృశ్యమైన
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 7:38 AM GMTఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మొత్తం నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు గమనార్హం. గుంటూరు నగరంలో నెహ్రూనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం నెహ్రూనగర్ కు చెందిన ఇద్దరు బాలికలు(ఒకరికి 14ఏళ్లు,ఇంకొకరికి 15ఏళ్లు) ఇద్దరు బాలురు (ఒకరికి 13ఏళ్లు,మరొకరికి 17ఏళ్లు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటుండడంతో తల్లిదండ్రులు వారి పనుల్లో వారు ఉన్నారు. అయితే.. చీకటి పడినప్పటికి కూడా వారు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు వారి కోసం చుట్టు ప్రక్కల గాలించారు. అయినప్పటికి వారు ఆచూకీ ఎక్కడా లభ్యం కాలేదు.
చివరికి గురువారం రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి నలుగురు చిన్నారులు అదృశ్యం కావడంతో.. దీనిని పోలీసులు చాలా సిరీయస్‌గా తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ సీతారామయ్య, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మధుపవన్ తో పాటు మరికొందరు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పట్టణంతో పాటు చుట్టపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో గాలించడం పాటు సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.