పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులకు పుణ్య క్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వేదికగా ఇటీవల జరగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరం. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవారు తమ స్వార్థ రాజకీయాలకోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవడం విచారకరం. లడ్డూ ప్రసాదంపై గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా విష ప్రచారాలు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నేయి కలిసిందనే ఆరోపణలపై ఓవైపు సీట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, లీకులు పేరిట మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ, ఆలయ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తున్నారు.
పరకామణి విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. దొంగతనం జరిగిందని చెప్పారు. పరకామణి వ్యవహారం నాకు తెలియదు. సిఐడి విచారణకు రమ్మని చెప్పారు . పరకామణి అంశంలో రేపు విజయవాడలో సిఐడి విచారణ హాజరవుతాను. అప్పన్న గతంలో నా పీఏ మాత్రమే...తర్వాత ఆయన నాతో లేరు..టీటీడీ వ్యవహారంలో అప్పన్నకు సంబంధం లేదు . అదే అంశాన్ని సిట్ కు చెప్పాను .తిరుమలలో అప్పన్న దర్శనానికి వస్తే వచ్చారేమో కానీ నాకు తెలియదు..అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.