మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ క‌న్నుమూత‌

Former Minister Vatti Vasanth Kumar passes away.మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్‌కుమార్ ఇక లేరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2023 8:20 AM IST
మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ క‌న్నుమూత‌

మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్‌కుమార్ ఇక లేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం తెల్ల‌వారుజామున ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలియ‌జేశారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పూండ్ల గ్రామం వ‌ట్టి వసంత‌కుమార్ స్వ‌స్థ‌లం. కాంగ్రెస్ పార్టీ నుంచి 2004, 2009ల‌లో ఉంగుటూరు నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.2014 ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

వ‌ట్టి వసంత్‌కుమార్‌ భౌతికకాయాన్ని విశాఖ నుంచి స్వ‌గ్రామానికి త‌ర‌లించేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story