మాజీ మంత్రి దేవినేని ఉమాకు క‌రోనా

Former minister Devineni Uma tests covid-19 positive.మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర్ రావుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 10:28 AM IST
మాజీ మంత్రి దేవినేని ఉమాకు క‌రోనా

మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర్ రావుకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 'నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను' అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. సోమ‌వారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క‌రోనా బారిన ప‌డ‌గా.. ఈ రోజు ఉద‌యం త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కొద్దిసేప‌టి త‌రువాత‌.. తాను క‌రోనా బారిన ప‌డిన‌ట్లు దేవినేని ఉమా చెప్పారు. ఇక మంగళవారం (జనవరి 18న) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే.. క‌రోనా కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌, దేవీనేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు పాల్గొన‌డం లేదు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వర్ధంతి టీడీపీ శ్రేణులు ప‌లు సేవాల కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలను చేప‌ట్టారు.

Next Story