ఏపీ ఫోరెన్సిక్‌ మాజీ డైరెక్టర్‌ అనుమానాస్పద మృతి

Former director AP Forensic department shivakumar died hotel. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్

By అంజి
Published on : 7 Jan 2023 2:40 PM IST

ఏపీ ఫోరెన్సిక్‌ మాజీ డైరెక్టర్‌ అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ విజయవాడలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. హైదరాబాద్‌కు చెందిన ఎక్కరాజు శివ కుమార్‌ కోర్టులో ఆధారాలు సమర్పించేందుకు విజయవాడకు వచ్చారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ లేబొరేటరీలో పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం హోటల్ యాజమాన్యం ఎన్నిసార్లు తలుపు తట్టినా, ఫోన్‌ చేసినా శివకుమార్ స్పందించలేదు. అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..

పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతడు ఉన్న గది తలుపులను పగులగొట్టారు. నేలపై మద్యం సీసాలు, సిగరెట్లు, ట్యాబ్లెట్లతో అతని నిర్జీవ దేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని నుదిటిపై గాయం కూడా ఉందని ఆరోపించారు. శివకుమార్ గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, పోలీసులు సెక్షన్ 174 సిఆర్‌పిసి (అనుమానాస్పద మరణం) కింద నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story