ఐదేళ్ల‌లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌

Five years old children mothers for corona vaccination.ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐదేళ్ల

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 9 Jun 2021 5:12 AM

ఐదేళ్ల‌లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐదేళ్ల లోపు చిన్నారులున్న త‌ల్లుల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేసే విష‌యంలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించుకుంది. ఈ మేర‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ నిబంధ‌న‌ల్లో మంగ‌ళ‌వారం నాడు మార్పులు చేసింది. 45ఏళ్లు వ‌య‌సు లేకున్నా కూడా ఐదేళ్లలోపు చిన్నారులున్న త‌ల్లుల‌కు వ్యాక్సిన్ వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీరు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు.

ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. ఒకరోజు ముందే టోకెన్‌లు ఇచ్చిన అనంతరం వీరిని వ్యాక్సిన్‌ సెంటర్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు అప్పజెప్పారు. కాగా.. రాష్ట్రంలో వీరి సంఖ్య 15నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇదే సమయంలో కేంద్రం ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం లబ్ధి పొందేవారు రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ జాబితాలోకే తల్లులూ వస్తారు. ఇక రాష్ట్రంలో జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభమవ్వగా.. మొదటి డోసులో ప్రభుత్వం ఎంపిక చేసిన 3 కేటగిరీల్లో కలిపి సుమారు 55.25 శాతం మంది, రెండో డోసులో 17.12 శాతం మంది చొప్పున టీకా పొందారు.

Next Story