సాధారణంగా శిశివులు 2.5 నుండి 3.5 కిలోల‌ బరువుతో జ‌న్మిస్తారు. అయితే..గుంటూరు జిల్లా తెనాలీలో బాలభీముడు జ‌న్మించాడు. 5 కిలోల బ‌రువుతో అసాధార‌ణ రీతిలో జ‌న్మించిన శిశువును చూసి వైద్య వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్యానికి గురి అయ్యాయి. తెనాలి మండ‌లం నంది వెలుగుకు చెందిన రేష్మ తొలి కాన్ఫు కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చింది. సాధార‌ణ కాన్ఫు క‌ష్ట‌మ‌ని తేల్చిన డాక్ట‌ర్లు.. ఆమెకు సిజేరియ‌న్‌(శ‌స్త్ర చికిత్స‌) ద్వారా కాన్పు చేశారు.

ప్ర‌స్తుతం త‌ల్లీ బిడ్డ‌లిద్ద‌రూ క్షేమంగా ఉన్నారు. దీని గురించి వైద్యులు మాట్లాడుతూ.. సాధారాణంగా పుట్టిన పిల్ల‌లు 2 నుంచి 4 కేజీల వ‌ర‌కు బరువు ఉంటార‌ని.. ఈ బాలుడు మాత్రం ఐదు కిలోల బ‌రువు ఉండ‌డం అరుదైన విష‌యం అని వైద్యులు అంటున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story