తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌కు దగ్గరే గోవిందరాజస్వామి ఆలయం .
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 1:27 PM ISTతిరుపతి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌కు దగ్గరే గోవిందరాజస్వామి ఆలయం ఉంది. అక్కడ ఉన్న లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే.. మంటలు దాదాపుగా భవనం మొత్తం వ్యాపించాయి. స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. మంటలు క్రమంగా పక్క భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. అందరూ ఆందోళన చెందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ఘటనాస్థలికి దగ్గరే గోవిందరాజస్వామిఆలయ రథం ఉంది. అటువైపుగా కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. గోవిందరాజస్వామి రథానికి మంటలు అంటుకునే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో.. అగ్నిప్రమాపక సిబ్బంది మంటలు ఎక్కువ వ్యాపించకుండా ఆర్పేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులోనే షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాంతో మంటలు వ్యాపించాయి. ఫొటో ఫ్రేమ్స్ దుకాణంలో ఉన్న కోట్ల రూపాయల విలువైన యంత్రాలు, ఫొటోలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మరో వైపు ఆ భవనం ముందు ఉన్న ఐదు బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగగానే.. అందులో ఉన్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. ఇంకా ఆ భవనంలో మరో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.