కాకినాడ: బోటులో పేలిన గ్యాస్ సిలిండర్.. 11 మంది సేఫ్
కాకినాడ తీరంలో ప్రమాదం చోటుచేసుకుంది. మత్స్యాకారులతో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 6:56 AM GMTకాకినాడ: బోటులో పేలిన గ్యాస్ సిలిండర్.. 11 మంది సేఫ్
కాకినాడ తీరంలో ప్రమాదం చోటుచేసుకుంది. మత్స్యాకారులతో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. నడి సంద్రంలో ఉండగా బోటులో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో.. పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 11 మంది మత్స్యకారులు ఉన్నారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కొద్దిరోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. దాంతో.. భోజన అవసరాల కోసం కావాల్సిన సామగ్రిని మొత్తం తీసుకెళ్తారు. అందులో భాగంగానే నిత్యవస సరుకులు, వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు. వేటకు విరామం ఇచ్చిన సమయంలో భోజనం వండుకుని అక్కడే తింటుంటారు. ఎప్పటిలానే అన్ని సరుకులు, గ్యాస్ సిలిండర్ తీసుకుని 11 మత్స్యకారులతో బోటు సముద్రంలోకి వెళ్లింది. అయితే.. తిరిగి తిరిగి వస్తుండగా బోటులో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో.. మంటలు చెలరేగాయి. వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కోస్టు గార్డు సిబ్బందికి సమాచారం అందించారు.
వారు కూడా వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ విధంగా పెనుప్రమాదం తప్పింది. మొత్తం 11 మంది మత్స్యకారులను ఒడ్డుకు చేరుస్తున్నారు కోస్టుగార్డు సిబ్బంది. కోస్టుగార్డు సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ప్రాణనష్టం తప్పిందనే చెప్పాలి. మత్స్యకారులు సమాచారం ఇవ్వలేకపోయినా.. సిబ్బంది త్వరగా స్పందించకపోయినా.. మత్స్యకారులు నీళ్లలో దూకాల్సి వచ్చేది. లేదంటే మంటల్లో చిక్కుకోవడమో జరిగేది. కాగా.. మధ్యాహ్నం వరకు 11 మంది మత్య్సకారులు ఒడ్డుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈ ఘటనలో బోటు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.
Fishing boat catches fire at Kakinada harbour#fishingboat #kakinadaharbour #firetragedy #RTVnewsnetwork pic.twitter.com/mmbqmP1c5L
— RTV (@RTVnewsnetwork) December 1, 2023