తమ్ముడు శ్రీను.. ఐ మిస్‌ యూ: మంత్రి నారా లోకేష్‌

ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను అనే అనే టీడీపీ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్‌ ఎమోషనల్‌ పోస్టు చేశారు.

By అంజి  Published on  1 Dec 2024 11:13 AM IST
Fan suicide, Minister Nara Lokesh, TDP

తమ్ముడు శ్రీను.. ఐ మిస్‌ యూ: మంత్రి నారా లోకేష్‌

అమరావతి: ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను అనే అనే టీడీపీ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్‌ ఎమోషనల్‌ పోస్టు చేశారు. ''ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్‌ చేసేవాడివి. నా బర్త్‌డే, పెళ్లి రోజులను పండుగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఓ మెసేజ్‌ చేయాలనిపించలేదా? దిద్దలేని తప్పు చేశావ్‌ తమ్ముడు. ఓ అన్నగా మీ కుటుంబానికి అండగా ఉంటా'' అని రాసుకొచ్చారు.

''అన్నా.. అన్నా... అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను'' అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

''తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు'' అని మంత్రి లోకేష్‌ కోరారు.

Next Story