గుంటూరులో దొంగ స్వామీజీ లీలలు.. 13 లక్షలు స్వాహా

టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతూ ఉన్నా కూడా కొందరు ఇంకా బాబాలను, స్వామీజీలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇంట్లో ఏదైనా అశుభం

By అంజి  Published on  6 Jun 2023 5:15 PM IST
Fake Swamiji , Guntur,  Cheating

గుంటూరులో దొంగ స్వామీజీ లీలలు.. 13 లక్షలు స్వాహా

టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతూ ఉన్నా కూడా కొందరు ఇంకా బాబాలను, స్వామీజీలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే పరిష్కారం ఏమిటా అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ చేయడం ఈ దొంగ బాబాలకు, స్వామీజీలకు షరామామూలే అనుకోండి. ఇక నమ్మారంటే ఇష్టమొచ్చినంత గుంజేయడం కూడా వీళ్ల స్కామ్ లలో ఒక భాగమే..! తాజాగా గుంటూరు జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇంట్లో దేవుడి ఫొటోలు కాలిపోవటంతో ఓ మహిళ దొంగస్వామిని ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళకు మాయమాటలు చెప్పిన దొంగస్వామి రూ.13 లక్షలు ఆమె వద్ద నుండి వసూలు చేశాడు. ఏవేవో కారణాలు.. ఇంకేవో పూజలు చేస్తున్నానని చెప్పి ఆమె నుండి భారీగా డబ్బును గుంజేశాడు. కొన్ని రోజులు తర్వాత తాను మోసపోయినట్టు మహిళ గుర్తించింది. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో దొంగస్వామి ఇచ్చేది లేదు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత మహిళ గుంటూరు పోలీసులను ఆశ్రయించింది.

Next Story