ఏపీలో టెన్త్ విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు
Exercise on allocation of marks of tenth class students in AP.కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో
By తోట వంశీ కుమార్ Published on 10 July 2021 6:57 AM GMT
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు గ్రేడ్లను కెటాయించేందుకు ఛాయరతన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విద్యార్థులకు ఏ విధానంలో గ్రేడ్లు ఇవ్వాలన్న దానిపై ఛాయరతన్ కమిటీ చేసిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు. ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్ – 1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, ఫార్మెటివ్ – 2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు.
ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు. అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంది. ఇక దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.