టీడీపీకి షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

EX MLA resigns to Telugudesam party.తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మ‌రో షాక్ త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్ కోట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 7:01 AM GMT
టీడీపీకి షాక్‌.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కి మ‌రో షాక్ త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావ‌తి టీడీపీకి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపనున్నట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు పలు కీలక పదవుల్లో పని చేసిన ఆమె కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆమె కుమార్తె స్వాతి రాణి వైసీపీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు పార్టీ మారితే తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని హైమావతి చెప్పుకొచ్చారు. మరోవైపు గతకొంత కాలంగా ఎస్ కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, హైమావతి మధ్య వర్గవిభేదాలు నెలకొన్నాయి. వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇదికూడా ఆమె రాజీనామా ఒక కారణం కావొచ్చున‌ని అంటున్నారు. హైమావ‌తి రాజీనామా చేసిన తర్వాత అధికార వైసీపీలో చేరుతారా..? లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Next Story
Share it