హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క‌న్నుమూత

EX MLA congress leader Thippeswamy passed away.అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిప్పేస్వామి క‌న్నుమూత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2021 6:13 AM GMT
Thippeswamy passed away

అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిప్పేస్వామి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప‌రిగిమండ‌లం సేవ మందిరంలోని ఆయ‌న నివాసంలో తుదిశ్వాస విడిచార‌ని బంధువులు తెలిపారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 1941లో జ‌న్మించిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి.. 1978లో తొలిసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1947లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంత స్థలంలో ఏఎం లింగన్న పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తిప్పేస్వామి మృతి విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిప్పేస్వామి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. పలువురు సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.


Next Story
Share it