ఏలూరు ఘటనలో 270 చేరిన బాధితులు

Eluru incident.. 270 victims .. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థకు గురైన వారి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

By సుభాష్  Published on  6 Dec 2020 2:33 PM GMT
ఏలూరు ఘటనలో 270 చేరిన బాధితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థకు గురైన వారి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 117 మందిని డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పది మందిని విజయవాడ తరలించారు.

అయితే అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైద్య బృందం ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, అస్వస్థతకు గురవుతున్న ప్రాంతాల్లో వైద్య బృందం ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశంలో సర్వే చేపడుతున్నారు.

ఫిల్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు బెడ్‌లను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాటి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

సోమవారం జగన్‌ పరామర్శ

నీరు, ఫుడ్‌ పాయిజన్‌ లాంటివి ఏవి జరగలేదని తెలుస్తోంది. అయితే విజయవాడ ఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరుకు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని సీఎం జగన్‌ సోమవారం పరామర్శించనున్నారు.

Next Story
Share it