నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్.. ఇలా వివిధ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలపై మరో భారం పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయిం తీసుకుంది. యూనిట్‌కు 45 పైసల నుంచి 140 పైసల వరకూ పెరగనున్నాయి. తిరుపతి సెనేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రెగ్యులేటరీ చైర్‌మన్ జస్టిస్ నాగార్జున ఈ మేరకు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు తప్పడం లేదన్నారు. గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి రూ.14 వందల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పెరిగిన ఛార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు.
పెంపు ఇలా..
- 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు
- 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు
- 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు
- 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6
- 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75పైసలు
- 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు