ప్రజాశాంతి పార్టీకి ఏ గుర్తు కేటాయించారో తెలుసా?

ప్రజాశాంతి పార్టీ.. ఈ పార్టీ అంటే మనకు గుర్తుకు వచ్చేది హెలీకాప్టర్. ఆ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గత ఎన్నికల్లో హెలీకాప్టర్ ను భారీగా పాపులర్ చేశారు

By Medi Samrat  Published on  9 April 2024 9:15 PM IST
ప్రజాశాంతి పార్టీకి ఏ గుర్తు కేటాయించారో తెలుసా?

ప్రజాశాంతి పార్టీ.. ఈ పార్టీ అంటే మనకు గుర్తుకు వచ్చేది హెలీకాప్టర్. ఆ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గత ఎన్నికల్లో హెలీకాప్టర్ ను భారీగా పాపులర్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ తమ పార్టీ సింబల్ ను చూపిస్తూ.. చేతులతో హెలీకాఫ్టర్ ఫ్యాన్ ను చూపిస్తూ కేఏ పాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ ఎన్నికల్లో కొత్త గుర్తు వచ్చింది.

ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించిందని కేఏ పాల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కుండ గుర్తును కేటాయించిందని తెలిపారు. కుటుంబ పాలన మనకు వద్దని కుండ పాలన కావాలని అన్నారు. కుండ గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు పాల్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ, ఏపీలో కామన్ సింబల్ తో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. మండుతున్న ఎండలకు డాక్టర్లు సైంటిస్టులు ఫ్రిజ్జిలోని నీళ్లు తాగొద్దని చెబుతున్నారని అందుకే మంచి జరగాలన్న మంచి చేయాలన్న కుండ పాలన రావాలని అన్నారు కేఏ పాల్.

Next Story