35 శాతం పెరిగిన గుడ్డు ధర.. ఒక్కొ గుడ్డు ఎంతంటే..?
Egg prices increase by 35% in Andhra.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోని రిటైల్ మార్కెట్‌లలో గుడ్ల ధరలు 35 శాతం
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2022 4:57 AM GMTఉత్పత్తి తగ్గి ఎగుమతులు పెరగడంతో ఇటీవలి కాలంలో గుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోని రిటైల్ మార్కెట్‌లలో గుడ్ల ధరలు 35 శాతం పెరిగాయి. ఒక్కో గుడ్డు రూ.7కు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక్కో గుడ్డును రూ.5.50కి విక్రయించారు.
దేశంలోనే అత్యధికంగా కోడిగుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని వ్యాపారులు తెలిపారు. దేశంలో మొత్తం గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 20 శాతం వాటాను కలిగి ఉంది. రాష్ట్రంలో రోజుకు ఐదు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
కోవిడ్ -19 గురించి పుకార్ల కారణంగా 2020లో రెండు నెలలకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో గుడ్డు మరియు చికెన్ వినియోగం బాగా తగ్గిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఇసిసి) తెలిపింది. కోవిడ్-19 సమయంలో రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచే జింక్ ముఖ్యమైన ఖనిజం కాబట్టి మే 2020 నుండి గుడ్డు వినియోగం పెరిగింది.
సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతులు పెరగడంతో హోల్‌సేల్‌తో పాటు రిటైల్ మార్కెట్‌లోనూ గుడ్ల ధరలు పెరిగాయని విశాఖపట్నం జోన్ ఎన్‌ఈసీసీ చైర్మన్ టీ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. గుడ్ల డిమాండ్ కు సరఫరా మధ్య స్వల్ప అంతరం కారణంగా రాబోయే నెలల్లో ధరలు ఇంకా పైకి ఎగబాకుతాయని చెప్పారు.
రిటైల్ మార్కెట్ లో గుడ్ల లభ్యత చాలా తక్కువగా ఉండడంతో సాధారణ గుడ్డు ధర రూ.7కు పెరిగింది. రానున్న రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వైజాగ్ నగరంలోని రిటైల్ గుడ్ల వ్యాపారి పి.సతీష్ తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంవత్సరానికి ఒక్కో వ్యక్తి 180 గుడ్లు తినాలని సూచించింది. అయితే.. ఇది వైజాగ్, విజయవాడ మరియు గుంటూరు లో 90 నుండి 105 గా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 నుంచి 70గా ఉంది.