ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. చార్జీషీట్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సీఎం జగన్‌తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డికి సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ర‌చ్చ న‌డుస్తోంది. రమేశ్‌కుమార్ పంచాయ‌తీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఎస్ఈసీ నిర్ణ‌యంపై ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించ‌నుంది. తాము ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేమంటూ ప్ర‌భుత్వం హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డానికి సిద్ద‌ప‌డుతోంది. క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉన్నందున స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని అంటూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం కోర్టును కోర‌నుంది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story