ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 11:58 AM GMT
EC,  final list,  voters,  Andhra Pradesh,

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం కేంద్రం ఎన్నికల ఒక ప్రకటనలో తెలిపింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసింది. ఓటర్ల జాబితాలను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకిరంచారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Next Story