రామాలయంలో కూలిన ధ్వజస్తంభం.. వీడియో

Dwajasthambham collapses in a temple near Piduguralla.రామాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండ‌గా అప‌శ్రుతి చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 10:22 AM GMT
రామాలయంలో కూలిన ధ్వజస్తంభం.. వీడియో

రామాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండ‌గా అప‌శ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ల సాయంతో ధ్వ‌జ‌స్తంభాన్ని నిల‌బెడుతుండ‌గా.. స్తంభం పై భాగం కొంత విరిగి ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ల మండ‌లం పందిటివారిపాలెం గ్రామంలో జ‌రిగింది.

స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పందిటివారి పాలెం గ్రామంలో పురాతన రామాల‌యం ఉంది. ఈ ఆల‌యంలో 1963లో 44 అడుగుల ఎత్తుతో 40 టన్నుల బ‌రువు గ‌ల భారీ ధ్వ‌జ స్తంభాన్ని ప్ర‌తిష్టించారు. గుత్తికొండ బిలం కొండల్లో ఏకశిలా నుంచి ఈ భారీ ధ్వజ స్తంభాన్ని తొలిచి ఇక్కడ ప్రతిష్టించారు. అప్పటి నుంచి ధ్వజ స్తంభం ఆలయం ఎదుట ఉంది. అయితే.. ఇటీవ‌ల ఆల‌యంలో పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ధ్వ‌జ స్తంభాన్ని కాస్త ప‌క్క‌కి జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. క్రేన్ల సాయంతో ప‌నిని పూర్తి చేయాల‌ని భావించారు. విజ‌య‌వాడకు చెందిన క్రేన్ల ఆప‌రేట్ల‌ర‌తో కూడా మాట్లాడారు.

ఈ క్ర‌మంలో రెండు భారీ క్రేన్‌ల‌ను తీసుకువ‌చ్చారు. ఇంజ‌నీర్ల స‌ల‌హాల‌తో ధ్వ‌జ స్తంభాన్ని ప‌క్క‌కి జ‌రిపే ప్ర‌య‌త్నం చేశారు. తొలుత భూమిలోంచి కొంచెం స్తంభాన్ని పైకీ తీశారు. మ‌రింత పైకి ఎత్తుతుండ‌గా.. స్తంభం పై భాగంలో కొంత భాగం విరిగిపోయి కింద ప‌డింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ చాలా మంది ఉన్నారు. అయితే.. ప్ర‌మాదాన్ని ప‌సిగట్టిన వారు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story