తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 8:45 AM ISTతాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం 5.30 గంటల నుంచే కూల్చివేతలను ప్రారంభించారు. పోలీసుల సమక్షంలో కూల్చివేతలు జరిగాయి. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లను వినియోగించి శ్లాబ్‌కు సిద్దంగా ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. ఇక ఈ సమయంలో అక్కడికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వచ్చి ఆందోళనలు చేసి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో కూల్చివేతలు జరిరగాయి.
తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. నీటిపారుదల శాఖ స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. బోట్ యార్డుగా వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం గత జగన్ ప్రభుత్వ కట్టబెట్టిందని వెల్లడించారు. అక్రమ నిర్మాణం చేస్తుండటంతో సీఆర్‌డీఏ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా శనివారం ఉదయం కూల్చివేతలు జరిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన CRDA అధికారులు శనివారం ఉదయం 5.30 గంటల నుంచే పోలీసులు సమక్షంలో కూల్చివేతప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో శ్లాబ్ కు సిద్ధంగా ఉన్న భవనం కూల్చివేత వైసీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా గేట్లు వేసి భారీగా పోలీసుల మోహరింపు pic.twitter.com/ZB7YkHCo4L
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 22, 2024
అయితే.. నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రోసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మితిమీరి వ్యవహరించొద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది. అయినా కూడా మున్సిపల్ అధికారులతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరుపుతుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారనీ.. వాటిని విస్మరిస్తున్నారని అన్నారు. వైసీపీ ఆఫీసులను కూల్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇది సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు.
Super 6 అమలు కన్నా Ycp ఆఫీసు కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాదా?విధ్వంసకారుడా? pic.twitter.com/k7rDQIU7KN
— Ambati Rambabu (@AmbatiRambabu) June 22, 2024