మ‌ద‌న‌ప‌ల్లె పారిశ్రామికవాడ‌లో పేలుడు.. ఒక‌రి మృతి

Cylinder Blast in Madanapalle.చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి పారిశ్రామికవాడ‌లోని ఓ సంస్థ‌లో పేలుడు సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 5:34 AM GMT
మ‌ద‌న‌ప‌ల్లె పారిశ్రామికవాడ‌లో పేలుడు.. ఒక‌రి మృతి

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి పారిశ్రామికవాడ‌లోని ఓ సంస్థ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. టీపీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌లో యూక‌లిప్ట‌స్ ఆయిల్ నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు వినియోగించే గ్యాస్ క్రోమాటోగ్ర‌ఫీ యంత్రం అమ‌ర్చుతుండ‌గా సిలిండ‌ర్ పేలింది.

ఈ ప్ర‌మాదంలో బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన టెక్నీషియ‌న్ లింగ‌ప్ప‌(42) మృతి చెంద‌గా.. ప‌రిశ్ర‌మ య‌జ‌మాని శివ మ‌హేష్‌, అక్క‌డే ప‌నిచేస్తున్న న‌యాజ్ బాషాలకు తీవ్ర‌గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story
Share it