ప్రకాశం జిల్లాలో పేలిన నాటుబాంబు..!
Country made bomb blast in Prakasam.ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో దాచిన నాటు బాంబును కుక్క నోటితో కొరికింది.
By తోట వంశీ కుమార్ Published on
13 April 2021 11:15 AM GMT

ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. ఓ ఇంట్లో దాచిన నాటు బాంబును కుక్క నోటితో కొరికింది. దీంతో పెద్ద శబ్దంతో ఆ బాంబు పేలింది. దీంతో కుక్క తల మొత్తం చిధ్రమైపోయింది. పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. వివరాల్లోకి వెళితే.. కుంభం ప్రభుత్వ హాస్పిటల్‌లో సమీపంలో ఉన్న రమేష్ అనే వ్యక్తి ఇంటి బాత్‌రూమ్‌లో ఓ నాటుబాంబును దాచి ఉంచాడు. ఓ వీధి కుక్క ఆ బాంబును నోటితో కొరికింది. ఒక్కసారిగా బాంబు పేలడంతో కుక్క తల చిద్రమై పోయింది. భారీ శబ్దంతో నాటు బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టారు. నాటు బాంబుని అడవి పందుల కోసం వాడుతునట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story