ముఖ్య‌మంత్రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కానిస్టేబుల్ అరెస్ట్‌

Cop arrested for abusing Jagan.ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఏఆర్ పోలీసు కానిస్టేబుల్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 5:27 AM GMT
ముఖ్య‌మంత్రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కానిస్టేబుల్ అరెస్ట్‌

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్మేడ్ రిజర్వు కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వర్లు బుధ‌వారం రాత్రి చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిదిలోని గౌరవరం గ్రామం హెచ్.పి పెట్రోల్ బంక్‌ సమీపంలోని ఓ టీస్టాల్ వ‌ద్ద ఓ వ్య‌క్తితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జ‌గ‌న్‌, ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుల‌పై అనుచిత వాఖ్యలు చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. అంతేగాక కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడాడు. దీన్ని ఓ వ్య‌క్తి త‌న సెల్‌ఫోన్‌లో వీడియో తీయ‌గా వైర‌ల్‌గా మారింది.

వీడియో తీసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై చిలకల్లు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేర‌కు స‌ద‌రు కానిస్టేబుల్‌ను చిల్ల‌క‌ల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది.

క్రమశిక్షణా చర్యలలో భాగంగా సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఓ బాధ్యత గల ఉద్యోగంలో ఉండి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నగర పోలీస్ కమీషనర్ తెలియ‌జేశారు.

Next Story