నెల్లూరులో మహిళ పై కానిస్టేబుల్ దాడి.. గొంతు కోసి పరార్
Constable attack on woman in nellore.నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య ఆత్మహత్యకు ఓ వివాహిత కారణమని
By తోట వంశీ కుమార్ Published on
27 March 2021 10:28 AM GMT

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన భార్య ఆత్మహత్యకు ఓ వివాహిత కారణమని భావించిన ఓ కానిస్టేబుల్ ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటన కొవ్వూరులో జరిగింది. వెంకటగిరి బెటాలియన్‌లో పనిచేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ సురేష్ భార్య నెల రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మరణానికి షేకున్(35) అనే మహిళనే కారణమని భావించాడు. దీంతో శనివారం ఉదయం లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న షేకున్‌పై దాడి చేశాడు. చిన్న కత్తితో గొంతు కోశాడు. ఆ దాడిలో మహిళ రెండు చేతుల మణికట్లు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
వెంటనే సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి మహిళను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story